Sun Transit | గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడి త్వరలో తన రాశిని మార్చుకోనున్నాడు. ఈ నెల 16న ఉదయం 4.27 గంటలకు ధనుస్సురాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడు ధనుస్సురాశిలోకి ప్రవేశించడంతో మూఢాలు ప్రారంభమవుతాయి. జనవరి 14 వరకు కొనసాగనున్నాయి. జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని గౌరవం, ఆత్మవిశ్వాసానికి కారకంగా భావిస్తారు. ఆయన 30 రోజుల పాటు ఒక రాశిలో ఉండి.. ఆ తర్వాత మరో రాశిలోకి ప్రవేశిస్తుంటాడు. దాంతో ఆయా రాశులవారిపై శుభ, ప్రత్యేక ప్రభావం చూపిస్తాడు. అందుకే సూర్యుడు ధనుస్సురాశిలోకి ప్రవేశించడంతో పలురాశుల వారికి మంచి ఫలితాలుంటాయి. ఈ ప్రభావం నెల రోజుల పాటు ఉంటుంది. ఉద్యోగాలు, వృత్తి సంబంధిత నిర్ణయాల్లో విజయం సాధిస్తారు.
సూర్యుడి సంచారం మేషరాశి వారికి ఆర్థిక లాభాలుంటాయి. వ్యాపారంలో మందకొడి పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లయితే.. ఇకపై మీరు ఆశించి స్థాయిలో లాభాలుంటాయి. మీరు వ్యాపారంలో పురోగతి చూస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఈ సమయంలో మీకు ఇష్టమైన వ్యక్తి మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై దృష్టి పెడుతారు. మీ నిర్ణయాత్మక సామర్థ్యాలు ఇతరులను ఆకట్టుకుంటాయి. పని విషయంలో పలువురు సలహా తీసుకుంటారు. మీ జీవితంలోకి ఒక వ్యక్తి వస్తారు. దాంతో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.
సూర్యుడు సింహ రాశికి అధిపతి. ఆయన సంచారంతో ఈ రాశివారి కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. ఈ సమయంలో వ్యాపారం కూడా మెరుగైన ఫలితాలను ఇస్తుంది. కోర్టులో ఏదైనా కేసు పెండింగ్లో ఉంటే.. తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయాన్ని గడపడానికి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉన్నతాధికారులు, సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా ఫలవంతంగా ఉంటుంది.
ఈ సమయం ధనుస్సు రాశి వారికి ప్రత్యేకంగా నిలుస్తుంది. పదోన్నతితో విదేశాలకు వెళ్లే అవకాశాలుంటాయి. కెరీర్, వ్యాపార దృక్కోణం నుంచి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ పిల్లలు సాధించే విజయంతో సోషల్ స్టేటస్ పెరుగుతుంది. మీకు దగ్గరి వ్యక్తులు విజయం సాధించడం ద్వారా ఆనందంగా ఉంటారు. కుటుంబంలో, కార్యాలయంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు కెరీర్ విషయంలో మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ సోషల్ స్టేటస్ పెరుగుతుంది. ఈ సమయం అన్ని రకాలుగా కలిసి వస్తుంది.
Read Also :
Venus Asta | శుక్రుడు అస్తమయం.. ఈ రాశులవారికి ఆర్థిక సమస్యలు దూరం.. వైవాహిక జీవితంలో ఆనందం..!
Rahu-Ketu Transit | కొత్త ఏడాదిలో రాహు-కేతువుల సంచారం.. ఈ రాశులవారికి అన్నీ సమస్యలే..!