Elon Musk | న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుని కార్యాలయంలోని రిసొల్యూట్ డెస్క్(అధ్యక్షుడు కూర్చునే స్థానం)లో ఆశీనుడై ఉన్న టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఫోటోతో వెలువడిన టైమ్ మ్యాగజైన్ తాజా సంచిక కలకలం సృష్టించింది. కవర్ పేజీ స్టోరీలో ఇన్సైడ్ ఎలాన్ మస్క్ వార్ ఆన్ వాషింగ్టన్(వాషింగ్టన్‌పై మస్క్ యుద్ధం వెనుక) అనే శీర్షికతో ఈ కథనాన్ని ప్రచురించింది.
జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఫెడరల్ ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేసేందుకు మస్క్ సాగిస్తున్న కృషిని ఈ కథనంలో పత్రిక ప్రధానంగా పేర్కొంది. బ్యూరోక్రసీని ప్రక్షాళన చేసే లక్ష్యంగా ఏర్పడిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్)కి మస్క్ సారథ్యం వహిస్తున్నారు. ఈ కథనాన్ని ట్రంప్ ఎద్దేవా చేశారు.