సోమవారం 26 అక్టోబర్ 2020
International - Sep 29, 2020 , 15:39:21

గ‌దుల‌ను గుహ‌గా మార్చినందుకు ముగ్గురు కార్మికులు స‌స్పెండ్‌!

గ‌దుల‌ను గుహ‌గా మార్చినందుకు ముగ్గురు కార్మికులు స‌స్పెండ్‌!

న్యూయార్క్ గ్రాండ్ సెంట్ర‌ల్ టెర్మిన‌ల్ కిందున్న గ‌దుల‌ను ఓ వ్య‌క్తి ముగ్గురు కార్మికుల‌ను పెట్టి గుహ‌గా మార్చారు. ఈ ప‌నిచేసిన ముగ్గురు కార్మికుల‌ను అధికారులు స‌స్పెండ్ చేశారు. ఈ గ‌దిలో టీవీ, రిఫ్రిజిరేట‌ర్‌, మైక్రోవేవ్‌, మంచం వంటి అన్ని సౌక‌ర్యాలు ఉన్నాయి. టీవీ, ఫ్యూట‌న్ల‌ను దాచ‌డానికి రూపొందించిన చెక్క క్యాబినెట్‌లు కూడా ఉన్నాయి.

ఈ విష‌యంపై మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ దర్యాప్తు నిర్వహించింది. అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సస్పెండ్ చేసిన‌ ముగ్గురు రైల్‌రోడ్ కార్మికుల‌లో ఒక‌రు వైర్‌మాన్, వడ్రంగి ఫోర్‌మాన్,  ఎలక్ట్రికల్ ఫోర్‌మాన్. వారికి జీతం లేకుండా సస్పెండ్ చేశారు. వీరిపై విచార‌ణ ఇంకా పెండింగ్‌లో ఉంది. 
logo