Indian Americans | అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. సరదా కోసం చేసిన పని విషాదానికి దారితీసింది. గడ్డ కట్టిన సరస్సుపై నడుచుకుంటూ వెళ్లి మంచులో ఇరుక్కుపోయి మహిళ సహా ముగ్గురు తెలుగు వాళ్లు మృతి చెందారు.
అరిజోనాలోని చాండ్లర్‌లో నివసిస్తున్న ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన నారాయణ ముద్దన (49), ఆయన భార్య హరిత, వైజాగ్‌కు చెందిన గోకుల్ మెడిసేటి (47) .. ఈ నెల 26న మధ్యాహ్నం అరిజోనాలోని కోకోనినో కౌంటీలోని వుడ్స్ కాన్యన్ సరస్సు వద్దకు వెళ్లారు. అక్కడ గడ్డకట్టిన నదిపై నడుస్తూ అందులో కూరుకుపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు ముగ్గురిని రక్షించే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు.
‘మంచులో కూరుకుపోయిన హరితను వెంటనే నీటిలో నుంచి బయటకు తీయగలిగాం. ప్రాణాలను రక్షించే చర్యలు చేపట్టినా సఫలం కాకపోవడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఆ తర్వాత నారాయణ, గోకుల్ మృతదేహాలను వెలికితీశాం. వీరు అరిజోనాలోని చాండ్లర్‌లో నివసిస్తున్నారు. ముగ్గురూ తెలుగువాళ్లు’ అని అధికారులు తెలిపారు.