ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాపై ఈయూ మరోసారి విమర్శల వర్షం కురిపించింది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఫారెన్ పాలసీ చీఫ్ జోసెఫ్ బోరెల్ మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతులు జరగకుండా పోర్టులను రష్యా బ్లాక్ చేసిందని, దీని వల్ల లక్షలాది మంది ఆకలితో అలమటిస్తున్నారని విమర్శించారు.
ఇది ఎంతోమందికి చావుబతుకుల సమస్య అని, ఉక్రెయిన్ నుంచి ధాన్యం ఎగుమతి చేసేందుకు రష్యా అనుమతించాలని డిమాండ్ చేశారు. బుధవారం నాడు ఉక్రెయిన్, ఐక్యరాజ్యసమితి, టర్కీ దౌత్యవేత్తలు రష్యన్ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో పోర్టుల విషయం కూడా చర్చిస్తారని తెలుస్తోంది.
ఉక్రెయిన్‌తో పోరులో భాగంగా రష్యా దళాలు కొన్ని పోర్టులను స్వాధీనం చేసుకొని, మరికొన్నింటిపై బాంబులు వేశాయి. అలాగే ఉక్రెయిన్ కూడా రష్యా చేతికి చిక్కూడదనే ఉద్దేశ్యంతో కొన్ని పోర్టులను పేల్చేసింది.