TG Budget | తుస్సుమన్న టూరిజం పాలసీ.. 15 వేల కోట్లు రాబడతామంటే.. కోటి పెట్టుబడులు కూడా రాలేదు!
TG Budget | రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, అందుకోసం కొత్తగా టూరిజం పాలసీ-2025-30 తీసుకువచ్చామని, దాని ద్వారా ప్రైవేట్ సంస్థల నుంచి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రాబడతామని నిరుడు బడ్జెట్ సమావేశాల్లో ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో ఘోరంగా విఫలమైంది.
TG Budget | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, అందుకోసం కొత్తగా టూరిజం పాలసీ-2025-30 తీసుకువచ్చామని, దాని ద్వారా ప్రైవేట్ సంస్థల నుంచి రూ.15 వేల కోట్ల పెట్టుబడులు రాబడతామని నిరుడు బడ్జెట్ సమావేశాల్లో ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో ఘోరంగా విఫలమైంది.
ఈ పాలసీ ద్వారా ఇప్పటివరకు కనీసం రూ.కోటి పెట్టుబడులు కూడా తీసుకురాలేదు. దీంతో పర్యాటక రంగంపై రేవంత్‌రెడ్డి సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తేలిపోయింది. కానీ, శుక్రవారం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ ప్రసంగంలో టూరిజం పాలసీ ద్వారా రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ప్రతిపాదన దశలో ఉన్నాయని బీరాలు పలికిన రేవంత్‌రెడ్డి సర్కార్.. ఈసారి బడ్జెట్లో పర్యాటక రంగం అభివృద్ధికి కేటాయించింది. రూ.1,224 కోట్లు మాత్రమే. దీంతో ఈ నిధులు సరిపోవని, పర్యాటక రంగానికి కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉన్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
3 లక్షల మందికి ఉద్యోగాలన్నారు..
రాష్ట్ర పర్యాటక రంగాన్ని ఎకో టూరిజం, మెడికల్ అండ్ వెల్నెస్ టూరిజం, స్పిరిచ్యువల్ టూరిజం, ఎంఐసీఈ టూరిజం, స్పోర్ట్స్ టూరిజంగా విభజించారు. తద్వారా 3 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పటివరకు కనీసం 100 మందికి కూడా ఉద్యోగాలు కల్పించలేకపోయింది. ఇప్పుడు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెప్పడం యువతను మోసగించడమేనన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

