Cyclone Chido | ఫ్రాన్స్ (France)లోని హిందూ మహాసముద్ర ద్వీపసమూహమైన (Indian Ocean archipelago) మయోట్ (Mayotte)ను అత్యంత శక్తిమంతమైన తుపాను (Worst Storm) అతలాకుతలం చేసింది. ఈ తుపాను ధాటికి వేల సంఖ్యలో ప్రజలు మరణించి ఉంటారని స్థానిక మీడియా అంచనా వేసింది.
ఆగ్నేయా హిందూ మహాసముద్రంలో ఏర్పడిన చిడో తుపాను (Cyclone Chido) గత రాత్రి మయోట్ను తాకింది. ఆ సమయంలో గంటలకు 200 కిమీ (124 mph) కంటే ఎక్కువ వేగంతో గాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి ఇళ్లు, ప్రభుత్వ భవనాలు, ఆసుపత్రులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ భారీ తుపాను ధాటికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. 300 మందికిపైగా గాయపడ్డారు.
అయితే, మృతుల సంఖ్య అసాధారణ రీతిలో ఉంటుందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు. వందలు, వేల సంఖ్యలో ప్రజలు మరణించి ఉంటారని ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘బాధితులను లెక్కించడం కష్టం. మృతుల సంఖ్య కచ్చితంగా వందల్లోనే ఉంటుదని భావిస్తున్నాం. బహుశా వేలల్లో కూడా ఉండొచ్చు’ అసి పేర్కొంది. కాగా గత 90 ఏళ్లలో ఇంత బీభత్సమైన తుపాను చూడలేదని స్థానిక అధికారులు చెబుతున్నారు.
🧵 I wonder if the catastrophic situation in Mayotte will get more attention than drones that aren’t drones. Where’s the hysteria about this. Where’s MSM 🤬
Cyclone Chido has devastated Mayotte, a small island in the Indian ocean with gusts of at least 226 kilometres per hour… pic.twitter.com/Mk65WPGCte
— Volcaholic 🌋 (@volcaholic1) December 15, 2024
Les bidonvilles de #Mayotte ont été rasés, leurs habitants engloutis par la boue et les tôles. Les 3/4 des maisons en dur n’ont #PlusDeToit. Pas d’#eau, pas de #nourriture, pas d’#électricité et des #pillages. Nos besoins: #ÉtatDUrgence + #Armée + #Médecins + #Aide massive pic.twitter.com/vDtHWgSvCG
— Estelle Youssouffa Députée (@DeputeeEstelle) December 15, 2024
Also Read..
అధికారుల అదృశ్యం వెనుక హసీనా హస్తం!
క్షణాల్లో సైబోర్గ్లుగా బొద్దింకలు