ఢాకా: మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉండగా బంగ్లాదేశ్‌లో వేలాది మంది మిలటరీ, పోలీస్ అధికారులను బలవంతంగా అదృశ్యం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో విచారణ సంఘం ఏర్పాటు చేసింది. అధికారుల అదృశ్యం వెనుక షేక్ హసీనా హస్తముందని కమిటీ పేర్కొన్నది.
‘సత్యాల ఆవిష్కరణ’ పేరున ఈ కమిటీ తన నివేదికను చీఫ్ అడ్వయిజర్ మహ్మద్ యూనస్‌కు శనివారం అందజేసింది. హసీనా హయాంలో 3,500 మందికి పైగా ఉన్నత అధికారులు అదృశ్యమయ్యారని, అధికారుల అదృశ్యానికి హసీనా ఇచ్చిన ఆదేశాలు, ఆమె ప్రమేయంపై ఆధారాలు లభ్యమయ్యాయని చీఫ్ అడ్వయిజర్ ప్రెస్ వింగ్ కార్యాలయం తెలిపింది.