మయామి ,జూలై : ఫ్లోరిడాలోని మయామికి చెందిన ఓ జిమ్నాసిస్ట్ నీటి అడుగున అద్భుతమైన విన్యాసాలు చేస్తున్నది. ఈ విన్యాసాలు చూసిన వారందరూ అవాక్కవుతున్నారు. మయామికి నగరానికి చెందిన క్రిస్టినా మకుషెంకో అనే జిమ్నాసిస్ట్ నీటి లోపల అద్భుతమైన స్టెప్పులతో చేస్తున్న డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
నీటి లోపల డ్యాన్స్ చేసిన మకుషెంకో టాలెంట్ ను అందరూ ప్రశంసిస్తున్నారు. ‘మీరు అద్భుతంగా చేస్తున్నారు. ఇది మాకెంతో నచ్చింది. వారెవ్వా సూపర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమెరికాకు చెందిన 26 ఏండ్ల క్రిస్టినా మకుషెంకో అంతర్జాతీయ స్విమ్మర్. 2011 లో యూరోపియన్ జూనియర్ చాంపియన్షిప్లో రెండు బంగారు పతకాలు కూడా సాధించింది. ఆ తరువాత ఆమె ఈతల పోటీల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది.