వాషింగ్టన్: అమెరికాకు చెందిన యూఎస్ ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (యూఎస్టీఆర్) సంస్థ భారత్‌ను మేధో సంపత్తి హక్కుల చౌర్యానికి పాల్పడుతున్న దేశాల జాబితాలో చేర్చింది. ఈ జాబితాలో రష్యాతోపాటు చైనా కూడా ఉండగా.. మొదటి స్థానంలో వియత్నాం నిలిచింది.
యూఎస్టీఆర్ 301 నివేదిక గురువారం విడుదలైంది. గత 13 ఏండ్లలో ఈ జాబితాలో వియత్నాం చేరడం ఇదే మొదటిసారి. కాగా అక్రమ వాణిజ్య విధానాలను అరికట్టడానికి తమ వద్ద ఉన్న అన్ని సాధనాలను వినియోగిస్తామని యూఎస్టీఆర్ ప్రతినిధి జేమీసన్ గ్రీర్ పేర్కొన్నారు.