39 రోజుల్లో 39 ఫైటర్ జెట్లు.. ఇరాన్ యుద్ధంలో కోల్పోయిన అమెరికా
ఇరాన్‌పై యుద్ధం కోసం చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్టు పలు నివేదికలు వెలువడుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య 39 రోజులుగా సాగిన యుద్ధంలో, 39 యుద్ధ విమానాలను యూఎస్ కోల్పోయినట్టు వార్తలు వెలువడ్డాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: ఇరాన్‌పై యుద్ధం కోసం చేపట్టిన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’లో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్టు పలు నివేదికలు వెలువడుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య 39 రోజులుగా సాగిన యుద్ధంలో, 39 యుద్ధ విమానాలను యూఎస్ కోల్పోయినట్టు వార్తలు వెలువడ్డాయి. అంతేగాక అమెరికాకు చెందిన పలు డ్రోన్లు, ఫైటర్ జెట్స్‌ను, నిఘా కోసం పంపిన వాటిని ఇరాన్ కూల్చివేసినట్టు తెలుస్తున్నది.
ఆధునిక కాలంలో అమెరికా వాయుసేనకు ఎదురైన భారీ నష్టాల్లో ఇదొకటిగా నివేదికలు పేర్కొన్నాయి. వివిధ వర్గాలను ఉటంకిస్తూ టీడబ్ల్యూజెడ్, సీబీఎస్, ఇతర అమెరికన్ మీడియా ఉదహరించిన రక్షణ నివేదికల్లో పై అంశాలు ఉన్నాయి.
దీని ప్రకారం, 39 రోజులు సాగిన యుద్ధంలో అమెరికా 39 యుద్ధ విమానాలను కోల్పోయింది. అలాగే మరో 10 యుద్ధ విమానాలు వివిధ స్థాయిల్లో దెబ్బతిన్నాయి. అమెరికా హొర్ముజ్ జలసంధిపైకి పంపిన 24 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లు, యూఎస్ నేవీ పంపిన ఎంక్యూ-4క్యూ ట్రిటాన్ నిఘా డ్రోన్లు మళ్లీ తిరిగిరాలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

