వాషింగ్టన్ : నాటో నుంచి అమెరికా బయటకు వచ్చే అవకాశం ఉందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. గ్రీన్లాండ్ను అమెరికా స్వాధీ నం చేసుకోవడానికి నాటో మిత్ర దేశాలు మద్దతివ్వకపోతే, ఈ పరిణామ ం జరుగుతుందని బెదిరించారు. గీన్లాండ్పై నాటో తమతో చర్చలు జరుపుతున్నదని,దేశ భద్రత కోసం గ్రీన్లాండ్ తమకు చాలా అవసమని చెప్పారు. అది తమ ఆధీనంలో లేకపోతే, దేశ భద్రత, ముఖ్యంగా గోల్డెన్ డోమ్ విషయంలో, పెద్ద లోపం ఏర్పడుతుందని తెలిపారు. ఈ విషయంలో తనకు మద్దతివ్వని దేశాలపై టారిఫ్లు విధిస్తానని ఇటీవల హెచ్చరించారు.
గ్రీన్లాండ్పై మద్దతివ్వనందుకు 10% సుంకాలు: ట్రంప్
గ్రీన్లాండ్ను తమకు అప్పగించడంలో సహకరించనందుకు డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ వంటి యూరోపియన్ దేశాలపై 10 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ పెంపు అమలులోకి వస్తుందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో ప్రకటించారు. గ్రీన్లాండ్పై ఎటువంటి ఒప్పందం కుదరకపోతే ఈ ఏడాది జూన్ 1 నుంచి ఈ సుంకాలను 25 శాతానికి పెంచుతానని ఆయన హెచ్చరించారు. గ్రీన్లాండ్పై అమెరికా నియంత్రణ కోసం తాను చేస్తున్న ప్రయత్నానికి మద్దతు ఇవ్వని దేశాలపై సుంకాలు విధిస్తానని హెచ్చరించిన మరుసటి రోజే తన మిత్రులైన యూరోపియన్ దేశాలపై ట్రంప్ సుంకాల మోత మోగించారు.