United Nations | ఐక్యరాజ్యసమితి: మహిళలు, బాలికలకు ప్రాణాంతక, భయానక ప్రదేశం ఇల్లేనని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. 2023లో రోజుకు 140 మంది మహిళలు, బాలికలు తమ జీవిత భాగస్వామి, కుటుంబసభ్యుల చేతుల్లో హత్యకు గురయ్యారని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి మరణాల సంఖ్య సుమారు 51,100 అని వివరించాయి. 2022 లో 48,800 మంది ఈ విధంగా మరణించినట్లు అంచనా.
ఈ నివేదికలను యునైటెడ్ నేషన్స్ విమెన్, యూఎన్ ఆఫీస్ ఆఫ్ డ్రగ్స్ అండ్ క్రైమ్ అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినం సందర్భంగా సోమవారం విడుదల చేశాయి. మహిళలు, బాలికలకు ప్రమాదకరమైన ప్రదేశం ఇల్లేనని వివరించాయి. ప్రతి లక్ష మంది జనాభాకు 2.9 మంది మహిళలు ఆఫ్రికా దేశాల్లోనూ, 1.6 మంది మహిళలు అమెరికాస్లోనూ ఈ విధంగా మరణించినట్లు తెలిపాయి. ఈ రేటు ఆసియా (0.8), యూరప్ (0.6)లో తక్కువ.