నియామి, ఆగస్టు 26: పశ్చిమ ఆఫ్రికాలోని నైజర్‌లో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, నై జీరియా దౌత్యవేత్తలు 48 గంటల్లో తమ దేశం విడిచిపెట్టి పోవాలంటూ తాజాగా అధికారం చేపట్టిన ఆ దేశ మిలటరీ పాలకులు శనివారం హెచ్చరికలు జారీ చేశారు. గత నెల 26న జనరల్ అబ్దురహమనేట్చియానీ ఆధ్వర్యంలో ఆ దేశ మిలటరీ తిరుగుబాటు చేసి దేశ అధ్యక్షుడు మహమ్మద్ బజౌమ్‌ను నిర్బంధించి అధికారా న్ని చేజిక్కించుకుంది.
ఈ చర్యను 15 దేశాలతో కూడిన పశ్చిమ ఆఫ్రికా రాష్ర్టాల ఆర్థిక సంఘం (ఈసీఓడబ్ల్యూఏఎస్) తీవ్రంగా ఖండించింది. ఆ దేశంలో ప్రజాస్యామ్య పునరుద్ధరణకు మా జీ అధ్యక్షుడిని వదిలిపెట్టి తిరిగి అతనికి అధికా రం అప్పజెప్పాలని డిమాండ్ చేసింది. దీనికి ఫ్రాన్స్ పదేపదే మద్దతు ఇచ్చింది. తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఫ్రాన్స్ పెత్తనం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసిన అబ్దురహమనే ట్చి యానీ ఫ్రెంచ్ దౌత్యవేత్తను తక్షణం దేశం నుం చి బహిష్కరిస్తున్నట్టు శనివారం ప్రకటించారు.
అంతేకాకుండా అమెరికా, నైజీరియా, జర్మనీ దౌత్యవేత్తలు కూడా 48 గంటల్లో తమ దేశాన్ని వీడాలంటూ నైజర్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ దేశంలో దౌత్యపరంగా సంక్షోభ పరిస్థితులు ఏర్పడ్డాయి. నైజర్‌ను పాలిస్తున్న సైనిక ప్రభుత్వానికి బుర్కినా, ఫాసో, మాలీవంది దేశాలు మద్దతు తెలిపాయి.