పనాజీ : బ్రిటిషర్లు భారత దేశాన్ని విడిచి వెళ్లడానికి కారణం సత్యాగ్రహం కాదని, వారు జనం చేతుల్లో ఆయుధాలను చూశారని, పరిస్థితి ఏ స్థాయికైనా వెళ్లవచ్చునని గ్రహించారని బీహార్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ చెప్పారు. భారతీయ చారిత్రక పరిశోధన మండలి ఓ కథనాన్ని సృష్టించిందని, “మీరు పుట్టుకతోనే బానిసలు” అంటూ ప్రచారం చేసిందని, దానిని అప్పటి ప్రభుత్వం సమర్థించిందని చెప్పారు. ఆనందిత సింగ్ రాసిన “ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఇన్ నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా (1498-1947)’ ఆవిష్కరణ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాలపై వ్యాఖ్యానించారు.