టెల్ అవీవ్: హమాస్‌తో 2023లో యుద్ధం ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించిన విషయాన్ని ఇజ్రాయెల్ తొలిసారిగా అంగీకరించింది. మరణాలపై గాజా ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాలు వాస్తవమేనని ఒప్పుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య 2023, అక్టోబర్ 7న యుద్ధం ప్రారంభమైన తర్వాత గాజాని ధ్వంసం చేయడమే కాక, ఇజ్రాయెల్ దళాలు హమాస్ ఉగ్రవాదులతో పాటు, పాలస్తీనా పౌరులకు తీవ్ర ప్రాణనష్టం కలిగించింది.
ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడుల్లో హమాస్ ఉగ్రవాదులతో పాటు పౌరులు కలిపి మొత్తం 71,667 మంది మరణించినట్టు గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది.