శాన్ఫ్రాన్సిస్కో: ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ ఉద్యోగుల తొలగింపు కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. ఇప్పటికే తమ సంస్థలోని వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన గూగుల్ తాజాగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులను నియమించేందుకు ఏర్పాటు చేసిన గ్లోబల్ రిక్రూటింగ్ టీమ్ నుంచి కూడా వందలాది మందిని తొలగిస్తున్నది.
ప్రపంచ వ్యాప్తంగా తమ సంస్థ నియామకాలు బాగా తగ్గుముఖం పట్టినందున రిక్రూటింగ్ టీమ్ సంఖ్యను కూడా కుదించాలని నిర్ణయించినట్టు గూగుల్ తెలిపింది.