వాషింగ్టన్: హెచ్-1బీ వీసా మార్గాన్ని అమెరికన్ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఆరోపిస్తున్నది. వేతనాలను కృత్రిమంగా తొక్కిపెట్టి, అమెరికన్ పౌరులకు బదులుగా విదేశీయులను నియమించుకుంటున్నాయని చెప్తున్నది.
ఫలితంగా అమెరికన్ పౌరులకు లేబర్ మార్కెట్ ప్రతికూలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నది.అమెరికన్లకు బదులుగా తక్కువ వేతనంతో, తక్కువ నైపుణ్యం గల కార్మికులను నియమించుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా హెచ్-1బీ వీసాను దోపిడీ చేస్తున్నారని పేర్కొంది.