న్యూఢిల్లీ: నిరుడు ఆగస్టులో ఆందోళనకారుల గుంపులు గణబభన్లోకి చొచ్చుకు రావడానికి 20 నిమిషాల ముందు భారత్కు పారిపోవడం ద్వారా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాణాలు దక్కించుకున్నారు. భారత్లోని ఒక ఉన్నతాధికారి నుంచి ఫోన్ చేసి పారిపోవాలని సూచించడం వల్లే ఆమె ప్రాణాలతో బయటపడిందని ఓ తాజా పుస్తకం సంచలన విషయం వెల్లడించింది!
దీప్ హల్దర్, జైదీప్ మజుందార్, సహిదుల్ హసన్ కొకొన్ రచించిన ‘ఇన్షాల్లాహ్ బంగ్లాదేశ్: ది స్టోరీ ఆఫ్ యాన్ అన్ఫినిష్డ్ రెవెల్యూషన్’ అనే పుస్తకంలో ఈ విషయం వెల్లడించారు.