అమెరికా: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ గ్రోక్లో ఫొటోలు క్రియేట్ చేసుకునే ఫీచర్లో మార్పులు చేసేందుకు ఎక్స్ సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇటీవల పలువురు గ్రోక్‌లోని ఇమేజ్ జనరేషన్ ఫీచర్లో అసభ్యకరమైన ఫొటోలను తయారు చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి ధోరణి పట్ల విమర్శలు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
గ్రోక్‌ను దుర్వినియోగం చేస్తున్న వారి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వాలు ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్‌ను కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోగ్రోక్ ద్వారా అసభ్యకరమైన కంటెంట్‌ను క్రియేట్ చేస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని వారం క్రితం మస్క్ తేల్చిచెప్పారు. పెయిడ్ సబ్‌స్ర్కైబర్లకు మాత్రమే ఇమేజ్ జనరేషన్ ఆప్షన్ ఇచ్చేలా గ్రోక్ పరిశీలిస్తున్నట్టు బ్లూంబర్గ్ వెల్లడించింది.