పాక్లో పశువుల పేడపై పన్ను!.. ప్రభుత్వంపై విపక్షాల ధ్వజం
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం త్వరలో ఆవులు, బర్రెలు పెంచుకోవడంపై పన్ను వేసే అవకాశం ఉన్నది. స్థానిక వార్త పత్రిక డైలీ టైమ్స్ కథనం ప్రకారం మరియం నవాజ్ సర్కారు ప్రతి పశువుకూ రోజుకు 30 పాకిస్థానీ రూపాయల రుసుమును చెల్లించడాన్ని తప్పనిసరి చేసే అవకాశం ఉన్నది.
- ఆదాయం కోసం రైతులపై భారమా?
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం త్వరలో ఆవులు, బర్రెలు పెంచుకోవడంపై పన్ను వేసే అవకాశం ఉన్నది. స్థానిక వార్త పత్రిక డైలీ టైమ్స్ కథనం ప్రకారం మరియం నవాజ్ సర్కారు ప్రతి పశువుకూ రోజుకు 30 పాకిస్థానీ రూపాయల రుసుమును చెల్లించడాన్ని తప్పనిసరి చేసే అవకాశం ఉన్నది. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని ప్రోత్సహించే ‘సుత్రా పంజాబ్’ బయో గ్యాస్ కార్యక్రమంలో భాగంగా పశువుల యజమానుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ రుసుమును ‘పేడ పన్ను’గా అభివర్ణించాయి.
ఇప్పటికే సాగు ఖర్చులు, ద్రవ్యోల్బణంతో దెబ్బ తిన్న రైతుల నుంచి పన్ను రూపంలో డబ్బులు పిండుకొనేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ అని విమర్శించాయి. అయితే 168 పశువుల కాలనీల్లోని 50 లక్షల పశువుల యజమానుల నుంచి ఈ పన్ను వసూలు చేసేందుకు మరియం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తున్నది. దీని ప్రకారం ప్రతి పశువుకు ప్రతి రోజూ పన్ను విధిస్తారు. ఈ మొత్తాన్ని బయో గ్యాస్ తయారీకి వినియోగిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cattle dung
- farmers
- Pakistan
- tax
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

