e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News గడువు పొడిగిస్తే తీవ్ర పరిణామాలు.. అమెరికాకు తాలిబన్ల హెచ్చరిక

గడువు పొడిగిస్తే తీవ్ర పరిణామాలు.. అమెరికాకు తాలిబన్ల హెచ్చరిక

కాబూల్‌: ఆప్ఘనిస్థాన్‌ నుంచి సైన్యం ఉపసంహరణకు నిర్దేశించిన గడువు పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు తాలిబన్లు హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ గతంలో చెప్పిన ఆగస్ట్‌ 31 నాటికి ఆ దేశ బలగాల ఉపసంహరణ పూర్తి కావాలని డిమాండ్‌ చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌లో తాజా పరిస్థితుల నేపథ్యంలో అక్కడున్న సైన్యాన్ని పూర్తిగా వెనక్కి రప్పించేందుకు ఆగస్ట్‌ 31 కంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందన్న బైడెన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో తాలిబన్లు తాజాగా ఈ హెచ్చరిక చేశారు.

ఒప్పందం ప్రకారం తన బలగాలను అమెరికా పూర్తిగా వెనక్కి రప్పించిన తర్వాతే తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తి కానంత వరకు తాలిబన్లు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. ఈ నేపథ్యంలో ఆప్ఘనిస్థాన్‌ నుంచి సైన్యం ఉపసంహరణకు నిర్దేశించిన ఆగస్ట్‌ 31 గడువును మరింత పొడిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికాకు తాలిబన్లు హెచ్చరించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement