కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లోని ప్రజలు తాలిబన్ల పాలనకు ఎందుకు అంతలా భయపడుతున్నారో చెప్పడానికి ఈ వీడియో ఓ నిదర్శనం. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న ఓ ఆఫ్ఘన్ పౌరుడిని ఓ సాయుధ తాలిబన్ షూట్ చేయడానికి ప్రయత్నించడం ఈ వీడియోలో చూడవచ్చు. ఎత్తయిన గోడ మీద ఉన్న ఆ వ్యక్తి లక్ష్యంగా షూట్ చేయగా.. బుల్లెట్ కాస్తా గోడకు తగిలింది. దీంతో ఆ వ్యక్తి అంత ఎత్తు గోడ మీది నుంచి అవతలి వైపు దూకేశాడు. దీనికి సంబంధించిన వీడియోను అస్వక న్యూస్ ట్విటర్లో షేర్ చేసింది. ఆ సాయుధుడు ఇంతకుముందు ఉన్న ఆఫ్ఘన్ పోలీసులాగే వ్యవహరిస్తాడని ఆ వ్యక్తి భావించినా.. అతడు మాత్రం తన తాలిబన్ భాషలో సమాధానమిచ్చాడని ఆ వీడియోను సదరు చానెల్ పోస్ట్ చేసింది. తాలిబన్ల రాక్షస రాజ్యానికి జడిసి వేల మంది ఆఫ్ఘన్లు దేశం విడిచి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.
Taliban Fighter shooting on a man trying to enter to the #kabulairport, He actually expected the Taliban to behave like the police of the previous Government, while No, Taliban speak another language of behavior. pic.twitter.com/3T8tcl4joY
— Aśvaka – آسواکا News Agency (@AsvakaNews) August 17, 2021