కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లు ఒక టీవీ న్యూస్ ఛానల్ కార్యాలయంలో తనిఖీ చేశారు. అందులో ఉన్న ప్రభుత్వ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాబూల్‌లోని టోలో న్యూస్ ఛానల్ ఈ విషయాన్ని ప్రకటించింది. సాయుధ తాలిబన్లు సోమవారం తమ కార్యాలయం ప్రాంగణంలోకి ప్రవేశించారని తెలిపింది. సెక్యూరిటీ సిబ్బంది వద్ద ఆయుధాలను పరిశీలించారని, ప్రభుత్వం ఇచ్చిన వాటిని తమ వెంట తీసుకెళ్లారని పేర్కొంది. అయితే, కార్యాలయాన్ని సురక్షితంగా ఉంచుతామని తాలిబన్లు హామీ ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ మేరకు టోలో న్యూస్ ఛానల్ సోమవారం ట్వీట్ చేసింది.
Taliban entered the TOLOnews compound in Kabul, checked the weapons of the security staff, collected govt-issued weapons, agreed to keep the compound safe. #Afghanistan pic.twitter.com/LhuMI7Z90u
— TOLOnews (@TOLOnews) August 16, 2021