కాబూల్: పైన ఉన్న రెండు ఫొటోలను చూశారా? ఎడమ వైపున ఉన్న ఫొటో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటిది. జపాన్‌లోని ఐవో జిమా దీవిని తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అమెరికా బలగాలు అక్కడ తమ జాతీయ పతాకాన్ని ఉంచుతున్న ఫొటో ఇది. ఆ కుడివైపు ఉన్నది తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌లో తీసినది. ఇక్కడ అమెరికా సైన్యం దుస్తుల్లో ఉన్నది తాలిబన్లు( Taliban ). వాళ్ల యూనిఫామ్‌లు వేసుకొని తమ తాలిబన్ జెండాను అచ్చూ అప్పట్లో అమెరికా బలగాలు ఎలా పెడుతున్నాయో అలాగే పెడుతూ ఫొటోలకు పోజులిచ్చారు. అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్థాన్ వదిలి వెళ్లగానే దేశం మొత్తాన్నీ తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు.. ఇప్పుడిలా అగ్రరాజ్యాన్ని వెక్కిరిస్తూ ఇలా చేయడం గమనార్హం.
అమెరికా బలగాలు వదిలి వెళ్లిన ఆయుధాలన్నీ ఇప్పుడు తాలిబన్ల ఆధీనంలోనే ఉన్నాయి. ఆఫ్ఘనిస్థాన్‌పై పూర్తిగా పట్టు సాధించామని చెప్పుకోవడానికి తాలిబన్లు ఇప్పుడిలాంటి ఫొటోలు, వీడియోలను రిలీజ్ చేస్తున్నారు. కాబూల్ రక్షణ బాధ్యతలను ఇప్పుడు తాలిబన్లు తమలోని బద్రి 313 బ్రిగేడ్‌కు అప్పగించారు. ఆ బ్రిగేడ్‌కు చెందిన వాళ్లే తమ జెండాను ఇలా నిలబెడుతూ ఫొటోలు దిగారు. అమెరికా బలగాలు ఐవో జిమాలో తమ జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్న ఆ ఫొటో చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
The Taliban dressed up in American military gear we left behind when we fled the country and staged their own mock Iwo Jima photo. pic.twitter.com/Akr2fQTnvq
— Clay Travis (@ClayTravis) August 21, 2021