న్యూఢిల్లీ, సెప్టెంబర్ 10: యూఎస్ న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ వెలువరించిన ‘ఉత్తమ దేశాల ర్యాంకింగ్స్ 2024’లో స్విట్జర్లాండ్ వరుసగా మూడో ఏడాది అత్యుత్తమ దేశంగా నిలిచింది. భారత్ మాత్రం 3 స్థానాలు దిగజారి 33వ స్థానంలో నిలిచింది.
ప్రపంచ వ్యాప్తంగా 89 దేశాల్లో నిర్వహించిన సర్వేలో సాహసం, క్రియాశీలత, వారసత్వం, వ్యాపార నిర్వహణ & అభివృద్ధి సామర్థ్యం, జీవన నాణ్యత, సంస్కృతి, సంప్రదాయాలు తదితర 10 అంశాల్లో ఉప ర్యాంకింగ్స్ తీసుకున్నారు. ఈ 10 అంశాల పరిశీలనకు 73 గుణాలను పరిగణనలోనికి తీసుకున్నారు. జీవన నాణ్యత, విస్తృత వాణిజ్య అవకాశాల్లో చక్కని పనితీరుతో స్విట్జర్లాండ్ ప్రథమ స్థానంలో నిలిచింది.