Health Minister | స్వీడన్ (Sweden)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విలేకరుల సమావేశంలో ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి (Health Minister) ఎలిసబెట్ లాన్ (Elisabet Lann) కుప్పకూలి కింద పడిపోయారు. మంత్రిగా నియమించిన కొద్దిసేపటికే తన పోడియం వద్ద నిల్చొని ఉన్న ఆమె ఉన్నట్టుండి కిందపడిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
సెప్టెంబర్ 9న స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ (Ulf Kristersson) విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 48 ఏళ్ల ఎలిసబెట్ లాన్‌ను ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. తన పోడియం వద్ద నిల్చొని ఉన్న లాన్ ఒక్కసారిగా కుప్పకూలి ముందుకు పడిపోయారు. అప్రమత్తమైన అధికారులు ఆమెకు సాయం చేశారు. అనంతరం ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్లే ఆమె ఇలా స్పృహ కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
🇸🇪 #Sweden’s new Health Minister Elisabet Lann collapsed during her introductory press conference alongside PM Ulf Kristersson pic.twitter.com/6EUuTei6e2
— Uncensored News (@Uncensorednewsw) September 9, 2025
Also Read..
PM Modi | భారత్, అమెరికా క్లోజ్ ఫ్రెండ్స్.. ట్రంప్ పోస్టుపై ప్రధాని మోదీ రియాక్షన్
Trump | ప్రధాని మోదీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా.. దిగొచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్
Trump Tariffs | భారత్‌పై 100 శాతం టారిఫ్ విధించండి.. యూరోపియన్ యూనియన్‌కు ట్రంప్ సూచన