మరికొన్ని రోజుల్లోనే భారీ సౌర తుఫాను భూమిని మరోమారు అతలాకుతలం చేస్తుందా? అంటే అవుననే సమాధానం చెప్తున్నారు సైంటిస్టులు. వారంపాటు ప్రశాంతంగా ఉన్న సూర్యుడి మళ్లీ సడెన్‌గా తన వయలెంట్ స్వభావాన్ని చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు. అయితే తాజాగా సూర్యుడిపై ఒక చిన్న సన్‌స్పాట్ (సూర్యడిపై చల్లని ప్రదేశం) కనిపించింది.
చాలా చిన్నగా ఉన్న ఇది రెండ్రోజుల్లోనే పదింతలపైగా సైజు పెరిగింది. దానికితోడు మరో చిన్న సన్స్పాట్తో కలిసి మరింత భారీగా మారింది. ఈ రెండు సన్‌స్పాట్స్ కేంద్రకాలు మన భూమి సైజులో ఉండటం గమనార్హం. దీన్ని ఏఆర్3085 సన్‌స్పాట్ అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. రెండ్రోజుల క్రితం కనిపించీ కనిపించనట్లు ఉన్న ఈ సన్‌స్పాట్.. ఇప్పుడు పదిరెట్లు సైజు పెరిగింది.
అక్కడితో ఆగకుండా మరో సన్స్పాట్తో కలిసి డబుల్ సన్స్పాట్గా అవతరించింది. దీని యాక్టివ్ ప్రాంతం మన భూమి వైపుగానే ఉంది. ఈ సన్‌స్పాట్స్‌లో సి-తరగతి సోలార్ మంటలు చెలరేగుతున్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. దాంతో ఈ ప్రాంతాల్లో పేలుడు జరిగితే.. భూమి వైపు అత్యంత భారీ సౌర తుఫాను దూసుకొస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు.