Suicide Attack | దాయాది పాకిస్థాన్‌లో భారీ పేలుడు (explosion) సంభవించింది. ఇస్లామాబాద్‌లోని కోర్టు (Islamabad court) ఆవరణలో బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో 10 మందికిపైగా మరణించారు. సుమారు 20 మంది గాయపడ్డారు.
పాక్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇస్లామాబాద్ జ్యుడీషియల్ కాంప్లెక్స్ సమీపంలోని పార్కింగ్ స్థలంలో ఓ కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది మరణించగా.. 20 మందికిపైగా న్యాయవాదులు గాయపడ్డారు. వాహనంలో అమర్చిన గ్యాస్ సిలిండర్ వల్ల ఈ పేలుడు సంభవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ ఘటనను పోలీసులు ఆత్మాహుతి దాడి (Suicide Attack)గా అనుమానిస్తున్నారు.
రద్దీ సమయంలో ఈ ఘటన జరగడంతో భారీగా ప్రాణ నష్టం వాటిల్లింది. అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో న్యాయవాదులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుడు చాలా తీవ్రంగా ఉండటంతో ఆ శబ్దం దాదాపు ఆరు కిలోమీటర్ల పరిధి వరకూ వినిపించినట్లు స్థానిక మీడియా నివేదించింది. గాయపడిన వారిలో ఎక్కువ మంది లాయర్లు, కోర్టు సిబ్బందిగా పేర్కొంది.
కాగా, దక్షిణ వజీరిస్థాన్ (Waziristan)లోని కాడెట్ కాలేజ్ వానా (Cadet College Wana) వద్ద తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (Tehreek-e-Taliban Pakistan) దాడిని పాక్ భద్రతా దళాలు భగ్నం చేసిన విషయం తెలిసిందే. కళాశాల విద్యార్థులను బందీలుగా చేసుకోవాలన్న టీటీపీ ప్రయత్నాన్ని పాక్ బలగాలు అడ్డుకున్నాయి. టీటీపీ ప్రయత్నాన్ని అడ్డుకున్న కొన్ని గంటల్లోనే ఇస్లామాబాద్ కోర్టు ఆవరణలో బ్లాస్ట్ జరగడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Islamabad blast pic.twitter.com/SMxZcDHP38
— Sardar Sammad Khan (@sardarsammadkh1) November 11, 2025
Also Read..
Booker Prize 2025: బూకర్ ప్రైజ్ గెలిచిన హంగేరి రచయిత డేవిడ్
ట్రంప్‌కి నేనెందుకు భయపడాలి?: జెలెన్స్కీ