న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన రాజ్యలక్ష్మి(23) అనే యువతి అమెరికాలో ఈ నెల 7న చనిపోయారు. ఆమె ఇటీవలే టెక్సాస్ ఏ&ఎమ్ యూనివర్సిటీ కార్పస్ క్రిస్టి నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
చనిపోవడానికి మూడు రోజుల ముందు నుంచి ఆమె తీవ్రమైన దగ్గు, ఛాతీ నొప్పితో బాధ పడ్డారని ఆమె విద్యా రుణం, అంత్యక్రియల కోసం నిధులు సేకరిస్తున్న ఆమె బంధువు చైతన్య తెలిపారు. గోఫండ్మీ ద్వారా నిధులు సేకరిస్తున్నట్టు ఆమె తెలిపారు.