US Ambulance: అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లి.. హైవేపై దూసుకెళ్లుతూ.. 13 కార్లను ఢీకొట్టాడు.. వీడియో
Ambulance Rash Driving: అమెరికాలో ఓ ఉన్మాది అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లి హైవేపై దూసుకెళ్లాడు. ఆ ఘటనలో 13 కార్లు ధ్వంసం అయ్యాయి. ఇంటర్ స్టేట్ హైవేపై ఈ ఘటన జరిగింది. వర్జీనియా పోలీసులు చేజింగ్ నుంచి తప్పించుకునే క్రమంలో దుండగుడు ఆ అంబులెన్స్ ఎత్తుకెళ్లాడు.
వాషింగ్టన్ డీసీ: అమెరికాలో అంబులెన్స్(US Ambulance)ను ఎత్తుకెళ్లిన ఓ దుండగుడు వర్జీనియా రాష్ట్రంలో బీభత్సం సృష్టించాడు. రోడ్డుపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ దాదాపు 13 కార్లను ఢీకొట్టాడు. నిందితుడిని క్లాడ్వెల్గా గుర్తించారు. అమెరికా జాతీయ హైవే 395పై దొంగలించిన అంబులెన్స్‌తో ఇష్టంవచ్చినట్లుగా దూసుకెళ్లాడు. తొలుత ఓ ట్రక్కును దొంగలించిన దుండగడు.. మరో వాహనాన్ని ఢీకొట్టాడు. అయితే ఆ సమయంలో పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతను మరో వాహనాన్ని హైజాక్ చేశాడు. ఆ తర్వాత పోలీసుల ఛేజింగ్ నుంచి తప్పించుకునేందుకు మళ్లీ అంబులెన్స్‌ను ఎత్తుకెళ్లాడు. ఆ అంబులెన్స్‌తో లేన్లు అన్నీ దాటుకుంటూ హంగామా చేశాడు.
MUST SEE: This is the start of I-395N rampage. Truck got on at 110N. Hit vehicles before Boundary Channel. Plowed into at least 5 before the bridge. Driver ran off. Will show you the stolen ambulance chase shortly. @ARLnowDOTcom @MetrorailSafety @TomJackmanWP #395rampage pic.twitter.com/dQyewlLcRW
— Dave Statter (@STATter911) August 12, 2023
పోలీసులు నిందితుడిని అదపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటన పట్ల దర్యాప్తు ప్రారంభించారు. 14వ స్ట్రీట్ బ్రిడ్జ్ ఏరియాలో ఉన్న ప్రధాన రోడ్లను మూసివేశారు. ఉన్మాది క్లాడ్వెల్ ఎత్తుకెళ్లిన అంబులెన్స్.. అర్లింగ్టన్ కౌంటీ ఫైర్ అడిపార్ట్మెంట్ది. అంబులెన్స్‌తో చాలా వేగంగా దూసుకెళ్లిన అతను క్షణాల్లో లేన్లు మారుస్తూ పోలీసులకు చిక్కలేదు. ముందు వెళ్తున్న కార్లను వెనక్కి నుంచి ఢీకొట్టేశాడు. కనీసం అరడజను మంది గాయాలతో బాధపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

