మాస్కో: ఒకవైపు సునామీ అలలు.. మరో వైపు కొండచరియలు విరిగిపడడంతో.. రష్యాలోని ఓ దీవిలో ఉన్న స్టెల్లర్ సముద్ర సింహం జీవులు తల్లడిల్లిపోయాయి. ఇవాళ రష్యాలోని కమ్చట్కా ద్వీపంలో 8.8 తీవ్రతతో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో సఖాలిన్ ప్రాంతంలో ఉన్న ఆంటిసిఫెరోవ్ దీవుల్లోని స్టెల్లర్ సముద్ర సింహాలు విలవిలలాడాయి. రాకాసీ సునామీ అలల నుంచి తప్పించుకున్న ఆ జీవులు తీరం వైపు వెళ్లే ప్రయత్నం చేశాయి. అయితే అదే సమయంలో సమీప కొండల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో స్టెల్లర్ సీ లయన్స్ తీవ్ర టెన్షన్‌కు గురయ్యాయి. తీరం దగ్గర ఉన్న రాళ్లపై చేరుకుని బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాయి. దానికి సంబంధించిన వీడియో ఒకటి రిలీజైంది. క్రూయిజ్ షిప్ లో ఉన్న ఓ ప్రయాణికుడు ఈ వీడియోను షూట్ చేశాడు.