కొలంబో: శ్రీలంక రెండు వైపుల నుంచి నొక్కుకుపోవాలని కోరుకోవడం లేదని ఆ దేశ నూతన అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అన్నారు. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య ఇరుక్కుపోవాలని అనుకోవడం లేదన్నారు. ఏదో ఒక బలమైన శక్తితో అంటకాగడానికి బదులుగా, భారత్, చైనాలతో సమతుల్య సంబంధాలను వృద్ధి చేసుకోవాలని తమ ప్రభుత్వం కోరుకుంటున్నదని తెలిపారు. ఆ రెండు దేశాల మధ్య తమ దేశం శాండ్విచ్ కాదని తెలిపారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవడానికి ఈ తటస్థ విదేశాంగ విధానం చాలా ముఖ్యమైనదని వివరించారు. .
శ్రీలంక నూతన ప్రధాన మంత్రిగా హరిణి అమరసూరియ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. 2000 సంవత్సరంలో సిరిమావో బండారనాయకే తర్వాత ఈ పదవిని చేపట్టిన మహిళా నేత హరిణి కావడం విశేషం.