Sri Lanka | టోక్యో : కష్టకాలంలో ఆదుకున్న భారత దేశాన్ని శ్రీలంక పట్టించుకోవడం లేదు. శ్రీలంక జలాల నుంచి చైనా పరిశోధక నౌకలు తమపై నిఘా పెట్టే అవకాశం ఉందన్న భారత్ ఆందోళనను శ్రీలంక పెడచెవిన పెట్టింది. జపాన్లో పర్యటిస్తున్న శ్రీలంక విదేశాంగ శాఖ మంత్రి అలీ సబ్రీ ఆ దేశ మీడియాతో మాట్లాడుతూ, విదేశీ పరిశోధక నౌకలపై తమ దేశం విధించిన మారటోరియం వచ్చే జనవరి వరకు మాత్రమే అమలవుతుందన్నారు. ఆ తర్వాత దానిని కొనసాగించబోమని చెప్పారు. కేవలం చైనా నౌకలను మాత్రమే అడ్డుకోలేమన్నారు.
ప్రాచీన సౌదీలో అద్భుత కట్టడాలు!
దుబాయ్: సౌదీ అరేబియాలో 6,500 నుంచి 8 వేల ఏండ్ల క్రితం అద్భుతమైన కట్టడాలు ఉండేవని ఆస్ట్రేలియన్ పరిశోధకులు చెప్తున్నారు. ‘లెవంట్’ జర్నల్ నివేదిక ప్రకారం.. ఈ కట్టడాలను స్టాండింగ్ స్టోన్ సర్కిల్స్ అంటారు. అప్పట్లో అక్కడి ప్రజలు తినే ఆహారం, వాడిన పరికరాలు, ధ రించిన ఆభరణాల గురించి ఆధారా లు లభించాయి. అగ్నిపర్వత ప్రాంతంలోని హర్రట్ ‘ఉవేరిడ్’లో ఉన్న కొన్ని కట్టడాలను విశ్లేషించినపుడు ఈ వివరాలు తెలిశాయి. ఈ కట్టడాల్లో 1,000 సంవత్సరాలకు పైగా నివసించిన ప్రజల అవశేషాలను గుర్తించారు.