Spain | ఐరోపా దేశమైన స్పెయిన్ (Spain)లో అన్ని ప్రధాన మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు నిలిచిపోయాయి (mobile network outage). డౌన్‌డిటెక్టర్ (DownDetector) ప్రకారం.. స్పానిష్ టెలికాం దిగ్గజం (Spanish telecom giant) టెలిఫోనికా (Telefonica)తో పాటు స్పెయిన్‌లోని అన్ని ప్రధాన నెట్‌వర్క్‌లు సడెన్‌గా ఆగిపోయాయి. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోన్ కాల్స్, టెక్ట్స్‌ను చేయలేకపోతున్నారు. టెలిఫోనికా నిర్వహిస్తున్న నెట్వర్క్ అప్‌గ్రేడ్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడి ఉండొచ్చని స్థానిక మీడియా నివేదిస్తోంది.
అయితే, మోవిస్టార్, ఆరెంజ్, వోడాఫోన్ వంటి ఇతర మొబైల్ నెట్వర్క్స్ కూడా నిలిచిపోయాయి. దీంతో వినియోగదారులు తమకు ఎదురైన సమస్యలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు. మొబైల్ నెట్వర్క్స్తోపాటు జాతీయ అత్యవసర నంబర్ ‘112’ కూడా ప్రభావితమైనట్లు స్పానిష్ మీడియా పేర్కొంటోంది. తాజా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు స్పెయిన్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా నాలుగువారాల క్రితం స్పెయిన్‌లో అంధకారం (power blackout) అలముకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మొబైల్ నెట్వర్క్స్ ఆగిపోవడంతో ఐరోపా దేశంలో ఏం జరుగుతోంది..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అంధకారంలో ఐరోపా దేశాలు..
గత నెల చివర్లో ఐరోపా దేశాలైన స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లలో అంధకారం అలుముకున్న విషయం తెలిసిందే. విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో జనజీవనం స్తంభించిపోయింది. ప్రజా రవాణా స్తంభించి భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. విమానాల రాకపోకలకు తీవ్ర జాప్యం ఏర్పడింది. రైలు సర్వీసులు సైతం నిలిచిపోయాయి. దవాఖానల్లో సర్జరీలు ఆగిపోయాయి. మెట్రో రైళ్లలో ప్రయాణికులు చిక్కుబడిపోగా, నిలిచిపోయిన లిఫ్టులలోనుంచి బయటపడలేక చాలామంది అందులోనే ఉండిపోయి ఇబ్బందులు పడ్డారు. ఐరోపాలో గంటలపాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం వెనుక సైబర్‌దాడి ఉండే అవకాశం లేకపోలేదని స్పెయిన్, పోర్చుగల్‌లోని పవర్ గ్రిడ్ అపరేటర్లు వెల్లడించాయి. స్పెయిన్, పోర్చుగల్‌లోని ప్రధాన నగరాలను కలిపే యూరప్‌లోని పవర్ గ్రిడ్‌పై సైబర్ దాడి జరిగి ఉండవచ్చని స్పానిష్ అధికారులు చెప్పారు.
Also Read..
“Power Outage | అంధకారంలో ఐరోపా దేశాలు.. సైబర్ దాడేనా?”
Indian Envoy | అమెరికా తరహాలో పాక్ సైతం ఉగ్రవాదులను అప్పగించాలి : ఇజ్రాయెల్‌లో భారత రాయబారి
భారత్‌లోని ట్రావెల్ ఏజెన్సీలపై అమెరికా ఆంక్షలు