Indian Envoy | అమెరికా తరహాలో పాక్ సైతం ఉగ్రవాదులను అప్పగించాలి : ఇజ్రాయెల్‌లో భారత రాయబారి
Indian Envoy | అమెరికా తరహాలోనే పాక్ కూడా ఉగ్రవాదులను (terrorists) భారత్‌కు అప్పగించాలని ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి (Indian Envoy) జేపీ సింగ్ (JP Singh) డిమాండ్ చేశారు.
Indian Envoy | పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)ను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత ఉగ్రవాదంపై భారత్ తన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయంగా మద్దతు కూడగట్టేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్‌లోని భారత రాయబారి (Indian Envoy) జేపీ సింగ్ (JP Singh) ప్రపంచ దేశాలకు కీలక సూచన చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకంకావాలని పిలుపునిచ్చారు. అమెరికా తరహాలోనే పాక్ కూడా ఉగ్రవాదులను (terrorists) భారత్‌కు అప్పగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
పాక్‌పై భారత్ చేపట్టిన దాడులకు దారితీసిన సంఘటనలను ఇజ్రాయెల్ టీవీ ఛానెల్ i24కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేపీ సింగ్ వివరించారు. ‘పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడులకు 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రజలను చంపారు. దీనికి ప్రతిగా భారత్ (India) ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించి పాక్‌లోని ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. అయితే, పాక్ మాత్రం భారత సైనిక స్థావరాలపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దీంతో భారత్ ధీటుగా బదులివ్వాల్సి వచ్చింది. పాకిస్థాన్‌పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ప్రస్తుతం కాస్త విరామం ఇచ్చాం అంతే. అది ముగిసిపోలేదు. ఉగ్రవాదంపై మా పోరాటం కొనసాగుతుంది. అలాంటివారు ఎక్కడున్నా వారిని అంతం చేయడంతో పాటు వారి మౌలిక సదుపాయాలను నాశనం చేస్తాం’ అని తెలిపారు.
ఇక 26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారుల్లో ఒకరైన తహవూర్ హుస్సేన్ రాణా (Tahawwur Hussain Rana)ను అమెరికా ఇటీవలే భారత్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అమెరికా తరహాలోనే పాక్ సైతం ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేశారు. హఫీజ్ సయీద్, సాజిద్ మీర్, జకీర్ రెహ్మాన్ లఖ్వీల వంటి ఉగ్రవాదులను భారత్‌కు అప్పగించాలన్నారు. ఈ సందర్భంగా ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న దేశాలు దానికి వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. మే 10వ తేదీన నూర్ ఖాన్ స్థావరంపై భారత్ జరిపిన దాడిని ‘గేమ్ ఛేంజర్’గా అభివర్ణించిన ఆయన.. ఈ ఘటనతో పాకిస్థాన్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని చెప్పారు. దీంతో కాల్పుల విరమణ కోసం పాక్ డీజీఎంవో భారత ప్రతినిధులను సంప్రదించారని వెల్లడించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోందని స్పష్టం చేశారు.
Also Read..
Jawan Suicide | జమ్ములో తెలంగాణ జవాన్ ఆత్మహత్య.. భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన ఆర్మీ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

