Jawan Suicide | జమ్ములో తెలంగాణ జవాన్ ఆత్మహత్య.. భౌతికకాయాన్ని కుటుంబసభ్యులకు అప్పగించిన ఆర్మీ
జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య (Jawan Suicide) చేసుకున్నాడు. అతని భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు.
హైదరాబాద్: జమ్ముకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణకు చెందిన జవాన్ ఆత్మహత్య (Jawan Suicide) చేసుకున్నాడు. అతని భౌతికకాయాన్ని ఆర్మీ అధికారులు కుటుంబ సభ్యులకు అందజేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సంపంగి నాగరాజు జమ్ముకశ్మీర్‌లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలోని సరోజ్ ఔట్‌పోస్టు వద్ద సెంట్రీ విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలో ఆదివారం (ఈనెల 18న) సాయంత్రం 4.30 గంటల సమయంలో తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో మంగళవారం ఉదయం అతని భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు అప్పగించారు. కుటుంబ సమస్యల వల్లే నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడని అతని బంధువులు వెల్లడించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

