Vishal-Sai Dhansika | తమిళ నటుడు విశాల్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే హీరోయిన్ సాయి ధన్సికను పెళ్లాడనున్నాడు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వారిద్దరూ పెళ్లి తేదీని ప్రకటించినట్లు సమాచారం. విశాల్, ధన్సిక ఇద్దరు 15 సంవత్సరాలుగా స్నేహితులుగా కాగా.. ఈ ఏడాదిలోనే ఏడడుగుల బంధంతో ఒకటి కాబోతున్నారు. గత కొద్దిరోజులుగా విశాల్ పెళ్లి వార్తలు వైరల్‌గా మారాయి. గతంలో పలువురు హీరోయిన్లతో పెళ్లి జరుగనున్నట్లు వార్తలు వచ్చినా అందులో ఏమాత్రం నిజం లేదని తేలింది.
తాజాగా ధన్సికను విశాల్ పెళ్లి చేసుకోనున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఇద్దరు పెళ్లి వార్తలను ధ్రువీకరించినట్లు సమాచారం. ఆగస్టు 29న ఇద్దరు పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తుంది. విశాల్ బర్త్‌డే కూడా అదే రోజుకావడం విశేషం. విశాల్-ధన్సిక పెళ్లి వార్తలు వచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య భారీగా వయసు తేడా ఉంది. విశాల్ వయసు ప్రస్తుతం 47 సంవత్సరాలు.
ఆగస్టు నాటికి 48 సంవత్సరాలు. ధన్సిక నవంబర్ 20, 1989న జన్మించింది. ప్రస్తుతం ఆమెకు 35 సంవత్సరాలు. ఇద్దరి మధ్య దాదాపు 12 సంవత్సరాల వయసు తేడా ఉంది. సాయి ధన్సిక దక్షిణాదిలో పలు సినిమాలు చేస్తున్నది. తమిళం, కన్నడ, తెలుగుతో పాటు మలయాళ చిత్రాల్లోనూ నటించింది. రజనీకాంత్ నటించిన ‘కబాలి’ (2016) చిత్రంలో తన నటనతో అందరి ప్రశంసలు అందుకుంది. రజనీకాంత్ కుమార్ పాత్రలో నటించింది. ఇదిలా ఉండగా.. విశాల్, ధన్సిక గత కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారని.. ఆగస్టులోనే ఏడడుగులు వేయబోతున్నారు.
త్వరలోనే నిశ్చితార్థం, పెళ్లి డేట్లపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. విశాల్ చివరిసారిగా మద గజ రాజ మూవీలో నటించారు. ప్రస్తుతం తమిళ మూవీ డిటెక్టివ్‌లో నటిస్తు్న్నాడు. ఈ మూవీకి దర్శకత్వం కూడా వహిస్తుండడం విశేషం. విశాల్‌కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. పలు చిత్రాలు తెలుగులోకి అనువాదమై హిట్‌గా నిలిచాయి. తన నటనతో దక్షిణాదిచిత్ర పరిశ్రమలో తన కంటూ గుర్తింపును సాధించారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా ఓ వైపు నడిగర్ సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.