ఏటీయంలో డబ్బులు విత్డ్రా చేసుకునే సమయంలో మన కార్డు డీటెయిల్స్ ఎవరి కంటా పడకుండా జాగ్రత్త పడటం మామూలే. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే ఎవరైనా ఏటీయంలో డబ్బులు తీసుకుంటుంటే వాళ్లకు కొంచెం దూరంలోనే ఆగిపోతారు. సదరు వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత తాము వెళ్లి డబ్బులు విత్డ్రా చేసుకుంటారు.
మరి ఆ డబ్బులు విత్డ్రా చేసుకునే వ్యక్తి ఎంతకూ అక్కడి నుంచి కదలకపోతే? ఏటీయం మెషీన్ ఎదురుగా కదలిక లేకుండా నిలబడిపోతే? ఇదే జరిగింది బ్రిటన్లో. ఇక్కడి రీటెయిల్ బ్యాంక్ టెస్కో ఏటీయం ముందు ఒక వ్యక్తి నిలబడి ఎంతకూ కదలడం లేదు. అతని తర్వాత తాము కూడా డబ్బులు డ్రా చేసేందుకు కొందరు వచ్చి దూరంగా క్యూలో నిలబడ్డారు.
అయితే ఆ వ్యక్తి ఎంత సేపటికీ కదలకపోవడంతో ఒక యువకుడు ముందుకొచ్చి అతన్ని పలకరించాడు. అతను సమాధానం చెప్పకపోవడంతో భుజంపై చెయ్యేశాడు. అంతే ఆ ఏటీయం మెషీన్ ముందు నిలబడింది మనిషి కాదు మన్నేక్విన్ (బొమ్మ) అని అతనికి అర్థమైంది.
ఇది చూసిన మిగతా జనాలు కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తమకు ఎదురైన అనుభవం తలచుకొని నవ్వుకున్నారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై ఫన్నీ జోకులు పేలుస్తున్నారు.
Man leaves a mannequin outside a Tesco cashpoint 😭 pic.twitter.com/CgYtG372RK
— UB1UB2 Southall (@UB1UB2) September 30, 2022