అహ్మదాబాద్ : దేశంలోనే తొలి ఎల్ఎన్జీ రైలు ప్రారంభమైంది. గుజరాత్‌లోని సబర్మతి రైల్వే స్టేషన్లో జెండా ఊపి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీన్ని ప్రారంభించారు. ఇది పూర్తిగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌తో నడుస్తుంది. ఎల్ఎన్జీతో నడిచే ఈ రైలు పూర్తిస్థాయి ట్యాంకుతో సుమారు 2 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు.
రైలు ఇంజిన్‌లో ఎల్ఎన్జీతో పాటు డీజిల్ కూడా పనిచేస్తుంది. ఎక్కువగా ఎల్ఎన్జీతోనే నడవడం వల్ల డీజిల్ వినియోగాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీని వల్ల కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, పర్టిక్యులేట్ మ్యాటర్ లాంటి ఉద్గారాలను తగ్గించవచ్చు.