హుజూర్నగర్, సెప్టెంబర్ 27: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బరాజ్ పునాదులకు పూర్తిస్థాయి రక్షణ కల్పించేందుకు ఒక చివరి నుంచి మరో చివరి వరకు డయాఫ్రం వాల్‌ను నిర్మించే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నదని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. మేడిగడ్డతోపాటు అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల దిగువన ఉన్న స్టిల్లింగ్ బేసిన్లను బలోపేతం చేసి, మరింత పొడిగించాల్సిన అవసరం కూడా ఉన్నదని చెప్పారు.
ఆదివారం ఆయన హుజూర్‌నగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఇవి ప్రస్తుతం సాంకేతిక పరిశీలనలో ఉన్న ప్రతిపాదనలేనని, తుది నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వస్తుందని చెప్పారు. ఐఐటీ-బాంబే, అంతర్జాతీయ స్థాయి ఇంజినీరింగ్ కన్సల్టెన్సీ సంస్థ ఏఎఫ్ఆర్ ఇండియా ఆయా పరీక్షల నివేదికలను అధ్యయనం చేసి మరమ్మతులు, పునరుద్ధరణ డిజైన్లను సిద్ధం చేస్తున్నాయని తెలిపారు. నవంబర్‌లో లేదా డి సెంబర్‌లో పనులు ప్రారంభించి వచ్చే వానకాలానికి పూర్తి చేయాలని ప్రభు త్వ లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు.