కాబుల్: అఫ్గానిస్థాన్‌లో మత ఛాందసవాదంతో పెట్టిన కొన్ని నిబంధనలు మహిళల ప్రాణాలను హరిస్తున్నాయి. భారీ భూకంపంతో శిథిలాల కింద ప్రాణాలతో ఉన్న మహిళలను పురుష సహాయక సిబ్బంది రక్షించడంలేదు. తాము వారిని ముట్టుకోకూడదు కాబట్టి రక్షించ లేమని, వారిని మహిళా రెస్య్యూ సిబ్బందే కాపాడాలని వారు తప్పుకుంటున్నారు.
దీంతో తగినంత మంది మహిళా రెస్క్యూ సిబ్బంది లేకపోవడంతో బాధితులు నిస్సహాయంగా శిథిలాల కింద చిక్కుకుపోయి రక్షించమంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వచ్చిన వరుస భూకపంపాలతో 2,200 మంది మరణించి మరుదిబ్బగా మారిన అఫ్గాన్‌లో శిథిలాల కింద ఉన్న శవాల వెలికితీతలోనూ సహాయకులు లింగ వివక్షను పాటిస్తున్నారు.