Elon Musk | ట్రంప్ బహిష్కరణ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన మస్క్.. ఏమీ చేయదల్చుకోలేదు అంటూ పోస్ట్
Elon Musk | అమెరికాలో ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ (Big Beautiful Bill) దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు, దేశంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు మధ్య చిచ్చును మరింత రాజేస్తున్నది.
Elon Musk | అమెరికాలో ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ (Big Beautiful Bill) దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు, దేశంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు మధ్య చిచ్చును మరింత రాజేస్తున్నది. ఈ బిల్లుపై ఇద్దరూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ట్రంప్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పన్నుల కోత, ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన ‘బిగ్ బ్యూటిఫుల్’ బిల్లు ఆమోదం పొందితే ఆ మరుసటి రోజే దేశంలో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవిస్తుందని టెస్లా కంపెనీ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకటించారు. దీనిపై స్పందించిన ట్రంప్ తాము ఇస్తున్న సబ్సిడీలకు కోత విధిస్తే మస్క్ తన దుకాణం మూసుకొని తిరిగి దక్షిణాఫ్రికాకు వెళ్లిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో మస్క్‌ను బహిష్కరిస్తారా..? అన్న ప్రశ్నకు ట్రంప్ బదులిస్తూ.. ఆ అంశాన్ని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ట్రంప్ హెచ్చరికలకు (Trumps Deportation Threat) తోక ముడిచిన మస్క్ కాస్త వెనక్కి తగ్గారు. దీన్ని మరింతగా పెంచడానికి చాలా ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతానికి ఏమీ చేయదల్చుకోలేదని పేర్కొన్నారు. ‘దీన్ని మరింతగా పెంచడానికి చాలా ఉత్సాహంగా ఉంది. చాలా చాలా ఉత్సాహంగా ఉంది. కానీ, ప్రస్తుతానికి నేను ఏమీ చేయదల్చుకోలేదు’ అంటూ మస్క్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
వారంతా సిగ్గుతో తలదించుకోవాలి..
బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు మూలంగానే ట్రంప్‌కు, టెస్లా అధినేతకు మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ బిల్లుపై తాజాగా సెనేట్‌లో ఓటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన సెనేట్ సభ్యులకు వ్యతిరేకంగా తన ఎక్స్ ఖాతాలో వరుసగా పోస్ట్‌లు పెట్టారు. ఈ బిల్లుతో అమెరికన్ల రుణ భారం పెరుగుతుందని, దీనికి ప్రజామోదం లేదని తెలిపారు. ఇది అత్యంత మూర్ఖపు బిల్లు అని వ్యాఖ్యానించారు. ‘ఈ పిచ్చి బిల్లు ఆమోదం పొందిన మరుసటి రోజే అమెరికన్ పార్టీ ఆవిర్భవిస్తుంది.
డెమోక్రాట్-రిపబ్లికన్ పార్టీల ఏకఛత్రాధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల గొంతును వినిపించే ఓ కొత్త ప్రత్యామ్నాయం అవసరం’ అంటూ ట్వీట్ చేశారు. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గిస్తామని ప్రచారం చేసిన రిపబ్లికన్లు ఇప్పుడు ఈ బిల్లుకు మద్దతునిస్తున్నారని వారంతా సిగ్గుతో తలదించుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ బిల్లు వల్ల దేశ రుణభారం మరింత పెరుగుతుందని మస్క్ ఆందోళన చెందుతున్నారు.
దుకాణం మూయిస్తా: ట్రంప్
ఎలాన్ మస్క్ వ్యాఖ్యలపై అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. టెస్లా కంపెనీ అధినేత దుకాణం మూసుకొని తన మాతృదేశమైన దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘నేను విద్యుత్తు వాహనాల వినియోగానికి వ్యతిరేకమని ఆయనకు తెలుసు. విద్యుత్తు కార్లు మంచివే.. కానీ అందరూ ఆ కార్లను కొనాలని బలవంతం చేయవద్దు. చరిత్రలో ఏ మానవుడూ పొందనంత సబ్సిడీని మస్క్ పొందుతున్నారు. ఆ సబ్సిడీలు లేకపోతే.. ఆయన దుకాణం మూసుకొని దక్షిణాఫ్రికాకు వెళ్లిపోవాల్సి వస్తుంది’ అని తన ట్రూత్ సోషల్ ఖాతాలో పేర్కొన్నారు. ‘రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు లేదా విద్యుత్తు కార్ల ఉత్పత్తి ఉండదు, మన దేశానికి ఎంతో ధనం మిగిలిపోతుంది’ అని మరో పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మస్క్.. దమ్ముంటే తన కంపెనీలకిస్తున్న సబ్సిడీలను కత్తిరించాలని సవాల్ చేశారు.
Also Read..
India-US | త్వరలో భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. చాలా తక్కువ సుంకాలతోనే డీల్ ఉంటుందన్న ట్రంప్
500 Percent tariff | రష్యాతో వ్యాపారం.. భారత్‌పై అమెరికా 500 శాతం సుంకాలు..!
Elon Musk | ఆ బిల్లును ఆమోదిస్తే.. కొత్త పార్టీ పెడతా!.. బిగ్ బ్యూటిపుల్ బిల్లుపై మస్క్ ప్రకటన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

