America | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఉత్తర ఇడాహో (Idaho)లోని కాన్ఫీల్డ్ పర్వత ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బందిపై దుండగులు కాల్పులు (Sniper attack) జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో కూటేనై కౌంటీలోని కాన్ఫీల్డ్ పర్వతం సమీపంలో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అక్కడ మంటలు ఆర్పుతున్న సిబ్బందిపై గుర్తు తెలియని దుండగుడు రైఫిల్స్‌తో కాల్పులు జరిపినట్లు కూటేనై కౌంటీ కార్యాలయం తెలిపింది. ఈ కాల్పుల్లో ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అప్రమత్తమైన అధికారులు నిందితుడిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. దుండగుడికి, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో పౌరులు కూడా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read..
Fatwa | వారు దేవుడి శత్రువులు.. ట్రంప్, నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ
India-US | షరతులకు రెండు దేశాలూ ఓకే.. జులై 8 నాటికి భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ప్రకటన..!
Artificial Rain | ఢిల్లీలో కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు.. ఎప్పుడు..? ఎందుకంటే..?