న్యూఢిల్లీ: రష్యాలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5.25 గంటలకు కంచట్కా ద్వీపకల్పంలో 7.0 తీవ్రతతో భూమి కంపించింది. తూర్పు తీర ప్రాంత నగరమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్చట్స్కీకి 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. 50 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. భూకంపం ధాటికి ఇండ్లలో వస్తువులు కిందపడిపోయాయి. అయితే పెద్దగా ఆస్తి నష్టం ఏమీ జరుగలేదని అధికారులు వెల్లడించారు. భారీ భూకంపం నేపథ్యంలో హొనులులు లోని యూఎస్ నేషనల్ సర్వీస్‌కు చెందిన పసిఫిక్ సునామా హెచ్చరిక కేంద్రం తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే కొద్దిసేపటి తర్వాత సునామా హెచ్చరికలను ఉపసంహరించుకుంది.
రష్యా నౌకాదళానికి కీలక ప్రాంతమైన పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్చట్స్కీ నగరంలో 1,80,000 మంది నివాసం ఉంటున్నారు. చుట్టూ అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో అత్యధిక భాగం నావల్ బేస్ అధీనంలో ఉంది. కాగా, పెట్రోపవ్‌లావ్‌స్కీ-కమ్చట్స్కీకి 280 మైళ్ల దూరంలో ఉన్న షివేలుచ్ అగ్నిపర్వతం బద్దలయ్యింది. సుమారు 8 కిలోమీటర్ల ఎత్తువరకు లావాను వెదజళ్లుతున్నది. దీంతో సమీపంలో ఉన్న ప్రాంతాలు మొత్తం బూడిదమయమయ్యాయి.
భూకంపం అంటే భూమిలోని క్రస్ట్ పొరలో అకస్మాత్తుగా విడుదలయ్యే ఒత్తిడి శక్తి. దీని ఫలితంగా భూమి లోపలి నుంచి బయటకు ప్రకంపనలు పుట్టించే తరంగాలు విడుదలవుతాయి. క్రస్ట్‌లో ఏర్పడే ఒత్తిళ్లు చాలా వరకు రాతి పొర వరకు మాత్రమే వస్తాయి. అయితే రాతి పొరను మించిపోయిన ఒత్తిడి వచ్చినప్పుడు అది బలహీన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఫలితంగా భూకంపాలు ఏర్పడుతాయి. అయితే భూకంప తీవ్రత అధికంగా ఉంటే దాని ప్రకంపనలు చాలా దూరం వరకూ విస్తరిస్తాయి.
The moment of the magnitude 7.0 #earthquake in Petropavlovsk-Kamchatsky )#Russia
Source: DHP KAMCHATKA https://t.co/NiHN0HQly6 pic.twitter.com/o7lOxUthcg— Weather monitor (@Weathermonitors) August 17, 2024