బీజింగ్: నాసా అంతరిక్ష కేంద్రం తరహాలో .. చైనా కూడా స్పేస్ స్టేషన్(China Space Station) నిర్మించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ అంతరిక్ష కేంద్రానికి డ్రాగన్ దేశం టైకోనాట్స్ను తీసుకువెళ్లింది. ముగ్గురు వ్యోమగాములు ఇవాళ నింగిలోకి ఎగిరారు. లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా.. షెంజూ-16 స్పేస్‌షిప్‌ను ఇవాళ చైనా ప్రయోగించింది. వాయవ్య చైనాలో ఉన్న జియుక్వాన్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి రాకెట్‌ను నింగిలోకి పంపారు. చైనా కాలమానం ప్రకారం ఉదయం 9.31 నిమిషాలకు రాకెట్ ఎగిరింది. లాంచ్ చేసిన 10 నిమిషాల తర్వాత షెంజూ-16 మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయింది. చైనా స్పేస్ స్టేషన్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత టైకోనాట్స్ వెళ్లడం ఇదే తొలిసారి.
ముగ్గురు టైకోనాట్స్..
మిషన్ కమాండర్ జింగ్ హైపెంగ్, స్పేస్లిఫ్ట్ ఇంజినీర్ జూ యాంగ్జూ, పేలోడ్ నిపుణుడు గుయి హైచావోలు ఇవాళ షెంజూ-16లో స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. జింగ్ అంతరిక్షంలోకి వెళ్లడం ఇది నాలుగోసారి. షెంజూ-1, షెంజూ-9, షెంజూ-11 మిషన్లలో కూడా ఆయన పాల్గొన్నారు. చివరి రెండు మిషన్లకు కమాండర్‌గా చేశారు. ఇక టైకోనాట్ జూ ఓ వర్సిటీ టీచర్. ఆయనకు డాక్టరేట్ డిగ్రీ ఉంది. చైనా స్పేస్ స్టేషన్లోకి వెళ్తున్న తొలి ఫ్లయిట్ ఇంజినీర్. బిహంగ్ యూనివర్సిటీలో ఆస్ట్రోనాట్ గుయి ప్రొఫెసర్‌గా చేస్తున్నారు. పేలోడ్ స్పెషలిస్టుగా ఆయన స్పేస్ స్టేషన్‌కు వెళ్తున్నారు. దాదాపు అయిదు నెలల పాటు షెంజూ-16 .. చైనా స్పేస్ స్టేషన్‌తో అనుసంధానమై ఉంటుంది.
Marking the first manned space mission after China's space station entered its application and development phase, the Shenzhou-16 spacecraft carrying three taikonauts was successfully launched onboard a Long March-2F carrier rocket at 9:31 am on Tuesday from the Jiuquan Satellite… pic.twitter.com/ap8CqqSXHF
— Global Times (@globaltimesnews) May 30, 2023
Read More..
Shanghai: మండుతున్న షాంఘై.. వందేళ్ల రికార్డు బ్రేక్