న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina).. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అయితే లండన్‌లో ఆశ్రయం పొందేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. హసీనాకు ఆశ్రయం కల్పించేందుకు బ్రిటన్ ఆసక్తిగా లేనట్లు తెలుస్తోంది. దీంతో హసీనా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ ఆరేబియా దేశాలతో ఆశ్రయం కోసం షేక్ హసీనా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు తమ కుటుంబసభ్యులు నివసించే అమెరికా, ఫిన్‌ల్యాండ్ దేశాలతోనూ ఆమె టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. హసీనా రాజీనామాతో పార్లమెంట్‌ను రద్దు చేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రభుత్వానికి నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ అధినేతగా కొనసాగనున్నారు.