Sheikh Hasina | బంగ్లాదేశ్ (Bangladesh) తాత్కాలిక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) సహా ప్రభుత్వంలోని మహిళా ఉద్యోగులను ‘సర్’ అని సంబోధించాలన్న ఆదేశాలను (Sir Title For Women Officials) రద్దు చేసింది. అడ్వైజరీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
కాగా, బంగ్లాదేశ్‌ను హసీనా దాదాపు 16 ఏళ్లు పాలించింది. తన పాలనలో అధికారులు తనతో సహా మహిళా అధికారులను ‘సర్’ అని సంబోధించాలంటూ ఆదేశించింది. హసీనా ప్రధానిగా ఉన్నంత కాలం అందరూ ఆమెను ‘మేడమ్’ అని కాకుండా ‘సర్’ అనే పిలిచేవారు. ఇప్పటకీ హసీనా జారీ చేసిన ఆదేశాలే అమలవుతున్నాయి. అయితే, మహిళా అధికారులను ‘సర్’ అని పిలవడం సామాజికంగా, సంస్థాగతంగా అనుచితమైనది కాదని తాత్కాలిక ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ మేరకు గతంలో హసీనా జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు చీఫ్ అడ్వైజర్ కార్యాలయం ప్రకటించింది. అంతేకాదు, భవిష్యత్తులో అధికారులను ఎలా సంబోధించాలన్న దానిపై రివ్యూ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.
Also Read..
Tesla | జులై 15న భారత్‌లో టెస్లా తొలి షోరూం ప్రారంభం..!
Kapil Sharmas Cafe | కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు.. హింసను ఖండించిన నిర్వాహకులు