Kapil Sharmas Cafe | కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు.. హింసను ఖండించిన నిర్వాహకులు
Kapil Sharmas Cafe | బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మ (Kapil Sharma)కు చెందిన కెనడాలోని కేఫ్ (Cafe)పై ఖలిస్థానీ ఉగ్రవాది కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేఫ్ నిర్వాహకులు తాజాగా స్పందించారు.
Kapil Sharmas Cafe | బాలీవుడ్ కమెడియన్, నటుడు కపిల్ శర్మ (Kapil Sharma)కు చెందిన కెనడాలోని కేఫ్ (Cafe)పై ఖలిస్థానీ ఉగ్రవాది కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేఫ్ నిర్వాహకులు తాజాగా స్పందించారు. ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు కపిల్ శర్మకు చెందిన కాప్స్ కేఫ్ నిర్వాహకులు ఇన్‌స్టా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘రుచికరమైన కాఫీ, స్నేహపూర్వకమైన సంభాషణలతో కస్టమర్లకు ఆనందాన్ని పంచాలనే ఆశతో ఈ కాప్స్ కేఫ్‌ను ప్రారంభించాం. ఇక్కడ హింస సృష్టించడం బాధాకరం. హింసకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడతాం. ఏమాత్రం వెనక్కి తగ్గం’ అని పేర్కొన్నారు. ఈసందర్భంగా ఘటన నేపథ్యంలో తమకు మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.
కెనడా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో నుంచి తొమ్మిది రౌండ్లు కేఫ్‌పై కాల్పులు జరిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేపట్టాయి. కాగా, కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో గల సర్రే ప్రాంతంలో ‘కాప్స్ కేఫ్’ (Kap’s Cafe) పేరుతో కపిల్ శర్మీ దీన్ని ఇటీవలే ప్రారంభించారు. ఈ కేఫ్‌ను ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఈ దాడి జరగడం గమనార్హం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. కేఫ్‌పై కాల్పులకు ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్ సింగ్ లడ్డీ బాధ్యత వహించారు. కేఫ్‌పై తానే కాల్పులు జరిపినట్లు ప్రకటించారు.
Also Read..
Khalistani Terrorist | కెనడాలో కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు.. బాధ్యత వహించిన ఖలిస్థానీ టెర్రరిస్ట్
Narivetta OTT | ఆదివాసీలపై పోలీసుల ఊచకోత.. ఓటీటీలోకి వచ్చేసిన టోవినో థామస్ ‘నరివెట్ట’
Uday Bhanu | నాకు చాలా బుల్లెట్స్ తగిలాయి.. యాంకర్ ఉదయభాను కౌంటర్ ఎవరికి?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

