Muthanga Incident | టోవినో థామస్ నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘నరివెట్ట’ ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా సోనీ లివ్ (Sony LIV) ప్లాట్ఫామ్లో జులై 10, 2025 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. వాస్తవానికి ఇది జులై 11, 2025న విడుదల కావాల్సి ఉండగా, ఒక రోజు ముందుగానే ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మలయాళంతో పాటు, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ సినిమా కథ 2003లో కేరళలో జరిగిన ఆదివాసీలపై పోలీసుల ఊచకోత ముతంగ సంఘటన (Muthanga Incident) ఆధారంగా తెరకెక్కింది. ఇది ఆదివాసీల హక్కులు, భూమి వివాదాలు, పోలీసుల మధ్య ఘర్షణల నేపథ్యంలో నడుస్తుంది. ఇందులో టొవినో థామస్ పోలీసు కానిస్టేబుల్‌గా నటించగా.. సూరజ్ వెంజరమూడు, చేరన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనురాజ్ మనోహర్ దర్శకత్వం వహించారు.